Hyderabad, June 10: నైరుతి రుతుపవనాలు (Monsoon) ఏపీలో (Ap)ప్రవేశించడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఆ తర్వాత తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తా తీరం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి గురువారం తెలంగాణ నుంచి దూరంగా వెళ్లింది. దీంతో రుతుపవనాలు (Monsoon) ముందుకు సాగడానికి అనుకూలంగా పరిస్థితులున్నాయి. రాబోయే 48 గంటల్లో గోవా, కర్నాటక, దక్షిణ ఏపీలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు (Tamilnadu)లోని మిగిలిన ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) June 9, 2022
రాయలసీమ (Rayalaseema) జిల్లాల్లోకి ప్రవేశించిన తర్వాత తెలంగాణలోకి రుతుపవనాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 13 వరకు రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 11 జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కురిసింది. అత్యధికంగా నిర్మల్ జిల్లా వానల్ పహడ్ 7.40, నిజామాబాద్ జిల్లా రెంజల్ 4.40 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
రుతుపవనాల రాక ఆసల్యం కావడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. పగలు ఎండలు, రాత్రుళ్లు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు అత్యంత ఎక్కువగా ఖమ్మంలో 31 డిగ్రీల వరకు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మ్యాప్ విడుదల చేసింది.
ఇలా రాత్రి ఉష్ణోగ్రతలు 23.7 డిగ్రీల నుంచి 31 డిగ్రీల మధ్య రాష్ట్రంలో నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే 21 జిల్లాల్లో 40 డిగ్రీలపై నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా రామగుండం 44.9, హన్మకొండ జిల్లా ధర్మాసాగర్ 44.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి