Vjy, August 15: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, విజయసాయి రెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన కేసు విచారణ నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు. కాగా జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి నమోదైన సీబీఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతనే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ నవంబర్ 11కు వాయిదా, రఘురామపై సుప్రీంకోర్టు సీరియస్, సీబీఐపై అసహనం
సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినా ఆ పధ్ధతినే అనుసరించాలని అప్పట్లో (2022 సెప్టెంబర్ 8న) హైకోర్టు స్పష్టం చేసింది. అయితే హైకోర్టు తీర్పును గత ఏడాది మార్చి నెలలో ఈడీ .. సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్లు బుధవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. అక్రమాస్తుల కేసు, సీఎం జగన్‌కు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు, పిల్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు
అయితే..కేసు ప్రారంభమైన వెంటనే తాను విచారణ నుండి తప్పుకొంటున్నానని జస్టిస్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. వాదనలు వినిపించేందుకు ఇరుపక్షాల న్యాయవాదులు సిద్ధమవ్వగా, జస్టిస్ సంజయ్ కుమార్ లేని ధర్మాసనం ముందు పిటిషన్లను లిస్ట్ చేయనున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుండి మొదలయ్యే వారంలో సీజేఐ ఆదేశాల మేరకు మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని ఆయన ఆదేశించారు.