Sexual Harassment. Representational Image | (Photo Credits: PTI)

తంబళ్లపల్లె, మే 12: చదువు నేర్పాల్సిన గురువే ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తండ్రి స్థానంలో ఉంది విద్యార్థులను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన గురువు దారి తప్పాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కన్నబిడ్డలాంటి కాలేజీ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. భయంతో ఆ విద్యార్థిని కాలేజీకి వెళ్లనని చెప్పింది. ఏమైందని తల్లిదండ్రులు నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సంస్కృతం పాఠాలు చెప్పే ఆ లెక్చరర్ .. మాయమాటలతో త‌న కాలేజీలోని విద్యార్థినిని శారీర‌కంగా లొంగదీసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. తన లైంగిక వాంఛ తీర్చితే.. ఏమి కావాలన్నా తాను చూసుకుంటాననే విద్యార్థినిని వేధించాడు.

వివరాల్లోకి వెళితే ఎస్వీయూ సంస్కృత విభాగంలో కాంట్రాక్ట్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న మాధవరెడ్డిని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని ఓ డిగ్రీ కాలేజీలో పరీక్షల పరిశీలకుడిగా నియమించారు. అయితే అదే కాలేజీలో చ‌దువుతున్న ఓ విద్యార్థిని ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. తన భార్యకు ఏడాదిగా ఆరోగ్యం సరిగా లేదని, కాలేజీలోని తన గదిలోకి ఒంటరిగా వచ్చి తన కోరిక తీరిస్తే ఏమి కావాలన్నా తాను చూసుకుంటాననే కీచ‌క లెక్చరర్ విద్యార్థినిని వేధించాడు. ఈ త‌రుణంలో గ‌త రెండు రోజు కిత్రం ఆ విద్యార్థిని సెల్‌ఫోన్‌కు కాల్‌ చేశాడు.

Telangana: తెలంగాణ వచ్చింది కనుకనే..మానుకోట జిల్లాగా మారింది, రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్మించడం చిన్న విషయం కాదని తెలిపిన మంత్రి హరీష్ రావు 

అయితే విద్యార్థిని తల్లిదండ్రులకు అనుమానం రావ‌డంతో సెల్ ఫోన్ ను ప‌రిశీలించారు. దీంతో అస‌లు విష‌యం వెలుగులోకి వచ్చింది.వాట్సాప్‌లో విద్యార్థినికి పంపిన ఆడియో మెసేజీలు చూసి షాక్ అయ్యారు. త‌న కూతురుకు పంపిన ఆడియో చాటింగ్ విన్న తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

కాలేజీ యాజమాన్యం దృష్టికి కామాంధుడి వైఖరిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమ బాట పడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు.

దీంతో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్‌పై పోక్సో కేసు నమోదైంది. పోలీసులు వివరాలు తెలుపుతూ ఎస్వీయూ సంస్కృత విభాగంలో కాంట్రాక్ట్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్న మాధవరెడ్డిని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని ఓ డిగ్రీ కాలేజీలో పరీక్షల పరిశీలకుడిగా నియమించారు. అధిక మార్కులు వచ్చేలా చూస్తానంటూ మంగళవారం విద్యార్థినితో మాధవరెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, ములకలచెరువు సీఐ షాదిక్‌ అలీ, ఎస్‌ఐ శోభారాణి.. మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆరోపణలు నిర్ధారణ కావడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు.