Nellore, Sep 8: గణేశ్ ఉత్సవాలతో (Ganesh Celebrations) ఊరూ-వాడా గొప్ప సంబురంగా ఉన్నది. నెల్లూరు (Nellore) జిల్లాలో కొలువుదీరిన గణపతులు చూడ ముచ్చటగా ఉన్నాయి. ముఖ్యంగా కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో ఆక్రిలిక్ ముత్యాలతో ఏర్పాటు చేసిన కదిలే గణపతి ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటోంది. స్థానిక ఠాగూర్ టీమ్ నేతృత్వంలో దాదాపు 36 వేల ముత్యాలతో 13 అడుగుల ఎత్తుతో కదిలే గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. వినాయకుని చెయ్యి, కళ్లు కదులుతూ భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు విగ్రహాన్ని రూపొందించారు.
Here's Video:
View this post on Instagram
ఖర్చు ఎంత?
దాదాపు రూ.1.50 లక్షలు ఖర్చు చేసి నెల రోజులపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. అయిదు రోజుల పాటు పూజల అనంతరం భక్తులకు ముత్యాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
పొలంలో వినాయకుడి చిత్రం, అద్భుతమంటూ నెటిజన్ల ప్రశంసలు..వీడియో ఇదిగో