Pothina Mahesh on Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు! ఆధారాలు ఇవిగో అంటున్న జ‌న‌సేన మాజీ నేత‌, చంద్ర‌బాబును జైల్లో క‌లిసి వ‌చ్చాక పవ‌న్ ఏయే ఆస్తులు కొన్నాడంటే?

నిన్న, మొన్నటి వరకు జనసేన పార్టీలో ఉండి వైసీపీలోకి వెళ్లిన‌ పోతిన మహేశ్‌ (Pothina Mahesh) శనివారం మీడియా సమావేశంలో పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పై తీవ్ర ఆరోపణలు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో జైలులో ఉన్న చంద్రబాబు (Chandra Babu) ను పవన్‌కల్యాణ్‌ కలిసి వచ్చిన తరువాత రాజకీయంగా అనేక మార్పులు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

Pothina Mahesh on Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు! ఆధారాలు ఇవిగో అంటున్న జ‌న‌సేన మాజీ నేత‌, చంద్ర‌బాబును జైల్లో క‌లిసి వ‌చ్చాక పవ‌న్ ఏయే ఆస్తులు కొన్నాడంటే?

Vijayawada, April 20: నిన్న, మొన్నటి వరకు జనసేన పార్టీలో ఉండి వైసీపీలోకి వెళ్లిన‌ పోతిన మహేశ్‌ (Pothina Mahesh) శనివారం మీడియా సమావేశంలో పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పై తీవ్ర ఆరోపణలు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో జైలులో ఉన్న చంద్రబాబు (Chandra Babu) ను పవన్‌కల్యాణ్‌ కలిసి వచ్చిన తరువాత రాజకీయంగా అనేక మార్పులు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు వద్ద పవన్‌కల్యాణ్‌ ప్యాకేజీలు(Packages) తీసుకుని అనేక ఆస్తులు కొనుగోళ్లు చేశారని, ఇందుకు తన వద్ద ఆధారాలున్నాయని వెల్లడించారు. బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేశారని ఆరోపించారు.

Raghu Rama Krishna Raju Files Nomination: టీడీపీ, జ‌న‌సేన కూట‌మికి షాక్ ఇచ్చిన ర‌ఘురామ కృష్ణంరాజు, బీ ఫాం ఇవ్వ‌క‌పోయినప్ప‌టికీ ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి నామినేష‌న్ దాఖలు, రెబ‌ల్ గా పోటీ చేస్తారా? 

కౌలు రైతుల పేరుతో ఎన్నారైల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారని పేర్కొన్నారు. జనసేన పార్టీలో కీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్‌కు రూ. 10 కోట్ల స్పోర్స్ట్‌ కారు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు పల్లకి మోయడమే పవన్‌ కల్యాణ్‌ లక్ష్యమని ఎద్దేవా చేశారు. పవన్‌ ప్యాకేజీ డబ్బులు బ్లాక్‌ మనీని హరిహర వీరమల్లు సినిమా ద్వారా వైట్ మనీగా మార్చుతున్నారని ఆరోపించారు. తన సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తానంటే తాను చర్చకు సిద్ధమని పోతిన మహేశ్‌ స్పష్టం చేశారు.

(The above story first appeared on LatestLY on Apr 20, 2024 05:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).