Anakapalle, June 14: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో గూడ్సు రైలు (Goods train) పట్టాలు తప్పింది (Derailed). దక్షిణమధ్య రైల్వే (SCR) పరిధిలోని తాడి-అనకాపల్లి మధ్య (Thadi-Anakapalle) బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్సు రైలు బుధవారం తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో విశాఖపట్నం-విజయవాడ (Visakhapatnam-Vijayawada) ప్రధాన మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిసింది. కొన్ని రైళ్లను అధికారులు రద్దు చేయగా, మరికొన్ని రైళ్లు ఆలస్యమవుతాయని తెలిపారు. జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దుచేశారు. ఇక విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (Vandhe bharath express) మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నది.
TSRTC: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కండక్టర్ కుటుంబానికి రూ. 50 లక్షలు ఇచ్చిన టీఎస్‌ఆర్టీసీ
ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. 8.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుందని అధికారులు చెప్పారు. దీంతోపాటు మరికొన్ని రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్ ను తిరిగి ట్రాక్ మీదకు తెప్పించారు. దాంతో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.