Tirupati, Aug 26: ఆంధ్రప్రదేశ్ లో (Andhrapradesh) తిరుపతి (Tirupati) జిల్లాలోని గూడూరు (Gudur)-నెల్లూరు జిల్లాలోని మనుబోలు (Manubolu) రైల్వే స్టేషన్ల మధ్య 2.2 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన అత్యంత పొడవైన రైల్వే ఫ్లై ఓవర్ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇది దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అత్యంత పొడవైన రైల్ ఓవర్ రైల్ (ఆర్వోఆర్)గా (Rail Over Rail Bridge) గుర్తింపు తెచ్చుకుంది. రెండేళ్లలోనే దీని నిర్మాణం పూర్తి చేశారు.విజయవాడ-గూడూరు మధ్య మూడో లైను పనుల కోసం దక్షిణ మధ్య రైల్వే రూ. 3,240 కోట్లు మంజూరు చేసింది. అందులో భాగంగానే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు.
South Centeal Railways announced the commissioning of its longest rail-on-rail flyover, having a length of 2.2 km, on the Gudur–Manubolu section to facilitate cross-movement of trains between Vijayawada and Renigunta and Chennai and Vijayawada.#Infra https://t.co/rNfeIHQXq0
— Lakshmisha K S (@lakshmishaks) August 26, 2023
Successfully Completed and Commissioned ✅👍 the 3rd line between Manubolu and Gudur railway stations in #AndhraPradesh, covering a stretch of 7.4 km.
CRS Inspection 👉17.08.2023
Authorisation received 👉 21.08.2023
The section had a ROR of more than 2 km over Gudur yard to… pic.twitter.com/bZT479A3fP
— Rail Vikas Nigam Limited (@RailVikas) August 23, 2023
పెరుగనున్న సగటు వేగం
32.5 టన్నుల యాక్సిల్ లోడుతో రైళ్లు ప్రయాణించేలా దీనిని నిర్మించారు. బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో విజయవాడ-రేణిగుంట, చెన్నై-విజయవాడ మధ్య ఎలాంటి అంతరాయం లేకుండా రైళ్ల రాకపోకలు సాగుతాయని, ఈ మార్గంలో రైళ్ల సగటు వేగం పెరుగుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.