Simhachalam, April 23: సింహాచలం (Simhachalam) అప్పన్న చందనోత్సవ (Chandanotsavam) ఏర్పాట్లపై విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర (Swaroopanandendra) మండిపడ్డారు. ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ విమర్శించారు. క్యూలైన్లలో భక్తుల (Devotees) అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు. గర్భాలయంలో ఆచారాలను మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే స్వామి వారి దర్శనానికి ఎందుకు వచ్చానా.. అని బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలం ఆలయానికి ఇప్పటికీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) లేకపోవడం దారుణమని స్వరూపానందేంద్ర అన్నారు. ఇన్ చార్జి ఈవోతో ఉత్సవాలు జరిపించడాన్ని ఆయన తప్పుబట్టారు.
The gurujii is upset
Simhachalam: నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం చూడలేదు: స్వరూపానందేంద్ర సరస్వతి | swaroopanandendra saraswati on chandanotsavam arrangements https://t.co/X1I0l8V7Dm
— P Pavan (@PavanJourno) April 23, 2023
కన్నీళ్లు ఆగట్లే!
‘నా జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హజరయ్యా. ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదు. దర్శనానికి ఎందుకు వచ్చానా? అని ఇప్పుడు బాధపడుతున్నాను. భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు ఆగట్లేదు’ అని స్వరూపానందేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.