
Tirumala, Apr 6: తిరుమలలో (Tirumala) కొందరు భక్తులు (Devotees) కాళ్లకు గోనె సంచులు (Gunny Bags) కట్టుకుని కనిపించారు. కొండపై ఎండ తీవ్రత విపరీతంగా పెరుగడమే దీనికి కారణం. ఆలయ పరిసర ప్రాంతాల్లోని కాలిబాటలో కొన్నిచోట్ల కూల్ పెయింట్ వేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేడి నుంచి పాదాలను కాపాడుకునేందుకు లడ్డూ ప్రసాద వితరణకు వినియోగించే జ్యూట్ బ్యాగులను పాదాలకు ధరించి భక్తులు నడుస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే టీటీడీ వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
