Vijayawada, Sep 22: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై ప్రాయశ్చిత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను (Prayaschitta Deeksha) కాసేపటి క్రితం ప్రారంభించారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ ఉదయం పూజల అనంతరం ఆయనకు అర్చకులు దీక్షా కంకణం కట్టారు. ఈ దీక్ష 11 రోజుల పాటు కొనసాగనుంది. దీక్ష అనంతరం పవన్ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Here's Video:
ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
AP: తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రం అయినందుకు ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. గుంటూరు (D) నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ ఉదయం పూజల అనంతరం ఆయనకు అర్చకులు దీక్షా కంకణం కట్టారు. ఈ దీక్ష 11… pic.twitter.com/nlMmSHSlEZ
— ChotaNews (@ChotaNewsTelugu) September 22, 2024
అనంతరం తిరుమలకు..
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేసిన అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటానని పేర్కొనడం తెలిసిందే.