Hyd, January 22: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల దర్శన టోకెన్లకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టోకెన్లు విడుదల కానుందని టీటీడీ అధికారులు వెల్లడించింది. ఆన్‌లైన్‌లో దర్శన టోకెన్లను విడుదల చేయనుంది టీటీడీ.
ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల కానుండగా ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శనం టోకెన్లు విడుదల కానుంది. మధ్యాన్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి.
24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానుండగా 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల కానుంది. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు, 8 రోజుల్లో దాదాపు 9 కోట్ల మంది పుణ్య స్నానాలు, 45 రోజులపాటు సాగనున్న ఆధ్యాత్మిక వేడుక
అలాగే జనవరి 23 నుండి తిరుపతిలో ప్రతిరోజు ఎస్‌ఎస్‌డీ టోకెన్లు విడుదల కానున్నాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ గతంలో మాదిరిగానే జనవరి 23వ ప్రతీరోజు ఎస్‌ఎస్‌డీ టోకెన్లను అందించనుంది. ఈ టోకెన్లను భక్తులు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్దనున్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్దనున్న శ్రీనివాసం కౌంటర్లలో గతంలో మాదిరిగానే ఎస్ ఎస్ డి టోకెన్లను పొందవచ్చు.