File (Credits: Twitter/TTD)

Tirupati, JAN 24: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీపి కబురు చెప్పింది. ఏప్రిల్‌-2024 మాసానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను (Special Darshan Ticket Quota) ఆన్‌లైన్‌లో బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అలాగే తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గదుల కోటాను మధ్యాహ్నం 3 గంట‌లకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. భక్తులు విషయాన్ని గ్రహించి.. ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో ముందస్తుగా దర్శన టికెట్లు, గ‌దుల‌ను బుక్‌ చేసుకోవాలని భక్తులకు సూచించింది.

Telangana Politics: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వీడియో ఇదిగో..  

 

అలాగే, తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.