Tirumala Temple (Credits: X)

Tirumala, Apr 9: తిరుమలలో(Tirumala) శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని(Ugadi Asthanam) టీటీడీ(TTD) మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఉత్సవమూర్తులకు అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు. తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించాక శుద్ధి నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితులు పంచాగ శ్రవణం చేశారు.

Tirumala Temple (Credits: X)