Mekapati Chandrasekhar Reddy (Photo-Twitter)

Nellore, Mar 24: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేశానంటూ తనపై దుష్ప్రచారం జరుగుతోందని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పార్టీ చెప్పినట్టుగానే తాను వైసీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణకే ఓటు వేశానని చెప్పారు. తన ఓటుతోనే వెంకటరమణ గెలిచారని అన్నారు. ఓటు వేసిన తర్వాత తాను ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వచ్చానని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదిలేసి, జగన్ కుటుంబం కోసం వచ్చిన వాడినని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని, ఇవ్వకపోతే లేదని అన్నారు. తనకు టికెట్ ఇచ్చే విషయంలో జగన్ కూడా సానుకూలంగా లేరని చెప్పారు. తన నియోజకవర్గం ఉదయగిరిలో తానంటే ఏమిటో చూపిస్తానని మేకపాటి అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్, అసెంబ్లీలో కనిపించని ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్ శిబిరంలో బలపడుతున్న అనుమానాలు

తనకు వ్యతిరేకంగా తమ పార్టీ నేతలే చేస్తున్నారని మేకపాటి మండిపడ్డారు. ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ ఫ్లెక్సీలను తాను తొలగిస్తున్నాననే తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారని విమర్శించారు.

Here's Video

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జగన్ ఫ్లెక్సీలను అధికారులు తొలగించారని.. ఆ వీడియోలను వాడుకుంటూ కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.