Chandrababu Naidu (Photo-X/TDP)

Vjy, Sep 4: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వరదల పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా నదిలో అదనంగా 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేదని అన్నారు. భవానీపురంలోకి ప్రవహించిన నీరు పలు ప్రాంతాలను ముంచెత్తింది. 2019 నుంచి బుడమేరు ప్రవాహాన్ని మళ్లించేందుకు చర్యలు చేపట్టలేదు.బుడమేరు కాలువ ఆక్రమణకు గురైందని అన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. క్కడ ఎలాంటి అవసరమొచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బురద తొలగింపు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. 62 మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2,100 మంది పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వందకుపైగా ఫైరింజన్లు సహాయక చర్యలో పాల్గొన్నాయని, పొక్లెయిన్లు, టిప్పర్ల ద్వారా వేస్టేజ్‌ను తరలిస్తున్నామని తెలిపారు.

వీడియో ఇదిగో, విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద, గండి పడకుండా పరివాహక గట్లకు మట్టి కట్టలు వేస్తున్న ప్రజలు

సహాయచర్యల్లో 32 మంది ఐఏఎస్‌లు పనిచేస్తున్నారు. 179 సచివాలయాలకు 179 మంది సీనియర్‌ అధికారులను ఇన్‌ఛార్జులుగా పెట్టాం. ఎవరైనా చనిపోతే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నాం. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందించాలని ఆదేశాలిచ్చాం. మంగళవారం 9,09,191 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశాం. ఇవాళ ఇప్పటి వరకు 6లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశాం. 8.50లక్షల వాటర్‌ బాటిళ్లు, 3లక్షల లీటర్ల పాలు, 5లక్షల బిస్కెట్‌ ప్యాకెట్లు అందించాం. 5లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేశాం. గర్భిణిలకు ప్రత్యేక వైద్యం అందించాలని ఆదేశాలిచ్చామని తెలిపారు.

Here's Video

విజయవాడకు బుడమేరు ప్రధాన సమస్యగా తయారైంది. చిన్న చిన్న వాగులన్నీ కలిసి బుడమేరు పెద్దదిగా మారింది. అటు కృష్ణానది, ఇటు బుడమేరు కలిసి విజయవాడను ముంచెత్తాయి. బుడమేరును గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఐదేళ్లపాటు ఏం చేశారని వైసీపీ నేతల్ని ప్రశ్నిస్తున్నాం. వాగులను కబ్జా చేయడమే ఈ దుస్థితికి కారణం. ఆఖరికి పోలవరం కాలువలోనూ మట్టిని తవ్వేశారు.

బుడమేరు నీరు కొల్లేరు, కృష్ణానదికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ప్రవాహ దారిలో కాలువలు, వాగుల్లో కబ్జాలు తొలగిస్తాం. ఇలాంటి విపత్తులను అందరూ సమష్టిగా ఎదుర్కోవాలి. వరద బాధితులు అందరికీ న్యాయం చేస్తాం. రేపు ఉదయానికి వరద పూర్తిగా తగ్గిపోతుంది’’అని చంద్రబాబు తెలిపారు.కేంద్రమంత్రి అమిత్‌ షాతో ఫోన్లో మాట్లాడాను. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరా. విజయవాడ, అమరావతి ముంపు బారిన పడకుండా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.