Vijayawada COVID Centre Fire: రమేష్‌ ఆస్పత్రిపై విచారణకు ఏపీ ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్‌, ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు, డా.రమేష్ పూర్తిగా సహకరించాలని ఆదేశాలు
Supreme Court of India | Photo-IANS)

Vijayawada, Sep 14: ఏపీలో 10 మంది కరోనా బాధితుల మృతికి కారణమైన విజయవాడ రమేష్‌ ఆస్పత్రిపై (Ramesh Hospitals) చర్యలు తీసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది. స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ప్రమాద కారకులపై (Vijayawada COVID Centre Fire) ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు (Andhra Pradesh High Court) ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Govt) దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ నారీమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తుపై ఏకపక్షంగా నిషేధం విధించడం సరికాదన్నారు. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల 10 మంది కరోనా పేషెంట్లు చనిపోయారని వివరించారు. రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం దర్యాప్తునకు సహకరించడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తు సాగే విధంగా హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని న్యాయవాది వాదించారు. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఏపీ ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

పరారీలో రమేష్ ఆస్పత్రి డైరెక్టర్, ఆచూకి తెలిపిన వారికి రూ. లక్ష రివార్డు ప్రకటించిన విజయవాడ నగరపోలీసు కమిషనర్‌, రంగంలోకి దిగిన ఎనిమిది ప్రత్యేక బృందాలు

డాక్టర్ రమేష్ కేసులో విచారణ జరపవచ్చని తెలిపింది. దర్యాప్తునకు డా.రమేష్ పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. అయితే రమేష్‌ అరెస్ట్‌పై సాక్ష్యాల ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకోవచ్చిన ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ (Doctor Ramesh) ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.  స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో అగ్నిప్రమాదం

హైకోర్టు ఆయనకు, మరో డైరెక్టర్ సీతా రామ్మోహన్ రావులను అరెస్టు చేయకుండా స్టే ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ గత గురువారం ఏపీ సర్కార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజా సుప్రీంకోర్టు నిర్ణయంతో ఏపీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దోషులను కోర్టులో నిలబెట్టే విధంగా విచారణ జరుపనున్నారు.