గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజార్లో కస్తూరి కంగన్ హాల్ వద్ద గణపతి మండపాన్ని సుమారు రెండు కోట్ల రూపాయలతో అలంకరించి నిర్వాహకులు తమ ప్రత్యేకతను చాటారు. మెయిన్ బజార్లో దశావతార రూపంలో కొలువైన గణనాథుడుని స్థానిక వ్యాపారులు 2 కోట్ల 20 లక్షల రూపాయలతో ముస్తాబు చేశారు. గత 18 ఏళ్లుగా ఇలా కరెన్సీ నోట్లతో అలంకరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మొదట్లో ఐదు లక్షల రూపాయలతో అలంకరించడం ప్రారంభించినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. ఆర్యవైశ్య సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు, పలువురు బ్యాంకు అధికారులతో పాటు పలువురు భక్తుల సహాయ సహాకారాలతో గణపతికి నగదుతో ఆలంకరణ చేసినట్లు మండపం నిర్వహకులు సంకా బాలాజీ గుప్తా చెప్పారు.
మంగళగిరిలో 2 కోట్ల 20 లక్షల కరెన్సీ నోట్లతో దశావతార గణనాధుడు
ఆర్యవైశ్య సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు, పలువురు బ్యాంకు అధికారులతో పాటు పలువురు భక్తుల సహాయ సహాకారాలతో గణపతికి నగదుతో ఆలంకరణ. pic.twitter.com/ICRUGOfy5i
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2023