
Vizag, Aug 05: విశాఖ రాజధాని అంశంపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిపాలన రాజధాని (AP Administrative Capital) కాబోతుందన్నారు. లీగల్ ఇష్యూస్ వల్లే కాస్త ఆలస్యం అవుతోందన్నారు. మరో రెండు మూడు నెలల్లో సీఎం జగన్ (CM YS Jagan) విశాఖ రాబోతున్నారని చెప్పారాయన. వైజాగ్ అభివృద్ధిలో అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యం ఉందన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు జీవించేందుకు అనువైన ప్రాంతం విశాఖ అని, ఇక్కడ అనువైన సౌకర్యాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
TTD New Chairman: టీటీడీ నూతన చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి నియామకం..
దక్షిణ భారత దేశానికి ముంబయి వంటిది విశాఖ అని వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వైజాగ్-వన్ ఇండియా (Vizag one India) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశాఖలో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.