siddham

అద్దంకి ‘సిద్ధం’ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి నేడు ఇక్కడ పేర్కొన్నారు.  మేదరమెట్లలో  జరగబోతున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం సభ ఏర్పాట్లను ఆయన నేడు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధం సభ బాపట్ల జిల్లాలో జరగడం సంతోష దాయకం అన్నారు. సభకు పెద్ద సంఖ్యలో తరలిరావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముందుగా వంద ఎకరాల్లో ఏర్పాట్లు మొదలుపెట్టినా.. సిద్ధం సభలకు వస్తున్న అపూర్వ స్పందనను దృష్టిలో పెట్టుకొని రెండు వందల ఎకరాలను సిద్ధం చేసుకున్నామన్నారు. సభకు తరలివచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...

అద్దంకి మేదరమెట్లలో జరగబోయే సిద్ధం సభ ఏర్పాట్లను పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారన్నారు. రాప్తాడు సభను మించే విధంగా అద్దంకి సిద్ధం సభ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 44 నియోజకవర్గాల ప్రజలు సభకు తరలిరానున్నారని, చాలా ప్రతిష్టాత్మకంగా సభ నిర్వహిస్తున్నామన్నారు. సభకు 15 లక్షలు మించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. 58 నెలల కాలంలో సీఎం వైయస్‌ జగన్‌ జనరంజక పరిపాలన అందించారన్నారు. ఇంతగా జనాకర్షణ కలిగిన నాయకుడు దేశంలోనే మరొకరు లేరన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలనకు కొత్త అర్థాన్ని తీసుకువచ్చి, పేద, బడుగు, బలహీనవర్గాలకు నిజమైన ప్రజాప్రతినిధిగా నిలబడ్డారని చెప్పారు.