Chaganti Meets CM jagan (Photo-AP CMO)

Tirumala, March 5: ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koreswararao) టీటీడీ (TTD) సలహాదారు పదవిని తిరస్కరించారు. టీటీడీ ధార్మిక ప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్టు ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) పేర్కొన్నారు. అయితే, ఈ పదవిని చేపట్టేందుకు చాగంటి విముఖత వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇవ్వడానికే అయితే తనకు పదవులు అవసరం లేదని, టీటీడీకి ఎప్పుడు అవసరం వచ్చినా సహకరించేందుకు తాను ముందుంటానని చాగంటి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కింద చూడొచ్చు.