 
                                                                 Hyderabad, Nov 29: డెబ్బై, ఎనభై ఏండ్ల వయసులో రావాల్సిన గుండెపోటు (Heart Attack) ఇప్పుడు చిన్నరుల్లోనూ కనిపిస్తున్నది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామంలోనూ ఇదే జరిగింది. గ్రామానికి చెందిన పదేళ్ల చిన్నారి దిగుట్ల సమన్విత గుండెపోటుతో మృతి చెందింది. ఉదయం స్కూల్ (School) కు వెళ్లేందుకు రెడీ అవుతుండగా చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గుర్తించిన తండ్రి నాగరాజు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ప్రాణాలు మాత్రం నిలపలేకపోయారు. మధ్యాహ్నం గుండెపోటుతో చిన్నారి మృతిచెందిందని వైద్యులు ధృవీకరించడంతో.. కన్నోళ్లు గుండెలు పగిలేలా రోధించారు. చిన్నారి సమన్విత లక్షేట్టిపేట మండలం కేంద్రంలోని కృష్ణవేణి హై స్కూల్ లో నాలుగవ తరగతి చదువుతున్నట్టు సమాచారం.
నాగ చైతన్య-శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్.. ఫోటోలు వైరల్
గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతి
మంచిర్యాల - జన్నారం మండలంలోని రోటిగూడెం గ్రామానికి చెందిన దిగుట్ల నాగరాజు-అనూష దంపతుల కుమార్తె దిగుట్ల సమన్వితకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందింది. pic.twitter.com/FruCZj02xm
— Telugu Scribe (@TeluguScribe) November 29, 2024
రెండు వారాల కిందట కూడా
సరిగ్గా రెండు వారాల క్రితం ఇదే మంచిర్యాల జిల్లాలో చెన్నూరు పట్టణం పద్మనగర్ కాలనీకి చెందిన పన్నెండేళ్ళ కస్తూరి నివృతి (12) బాలిక గుండెపోటుతో మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపగా.. తాజాగా సమన్విత ఘటనతో మంచిర్యాల జిల్లాలో ఆందోళన నెలకొంది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
