Hyderabad, Aug 25: హైదరాబాద్ (Hyderabad) రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ (NMDC) హైదరాబాద్ మారథాన్-2024 (Hyderabad Marathon 2024) 13వ ఎడిషన్ కాసేపటి క్రితం లాంఛనంగా ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ కొనసాగనుంది. ఫుల్ మారథాన్ ను జెండా ఊపి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆరంభించారు. మారథాన్ లో వివిధ దేశాలకు చెందిన రన్నర్లు కూడా పాల్గొన్నారు. ఈ మారథాన్ ను హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి సరికొత్తగా ఎన్ఎండీసీ మారథాన్ ను స్టార్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు.
Hyderabad Marathon : మారథాన్ 13వ ఎడిషన్ ప్రారంభం - TV9
► TV9 News App : https://t.co/YOmRtQvGiN #Hyderabad #Marathon #tv9telugulive pic.twitter.com/zNJ7zmja57
— TV9 Telugu (@TV9Telugu) August 25, 2024
అందుకోసమే మారథాన్
ప్రతి ఏడాది నిర్వహించే ఈ మారథాన్ ఫిట్ నెస్ అవేర్ నెస్ పెంచేందుకు దోహదం చేస్తోందని నిర్వాహకులు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద రెండో మారథాన్ గా ఇది రికార్డు సృష్టించనున్నదని వెల్లడించారు.