Hyderabad, NOV 17: వచ్చే ఏడాదికి సంబంధించిన సెలవుల విషయంలో క్లారిటీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం (Telanagan Govt.). జనరల్ సెలవులతో (Genaral holidays) పాటూ, ఆప్షనల్ సెలవులు (Optional Holidays), వేతనంతో కూడిన సెలవుల లిస్టును తాజాగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ (Somesh kumar) విడుదల చేశారు. 2023లో మొత్తం 28 జనరల్ సెలవులు, 24 ఆప్షనల్ సెలవులున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులతో పాటు ఉన్నతాధికారుల అనుమతితో 5 మాత్రమే ఆప్షనల్ హాలిడేస్ పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది. వాటితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పండగల కోసం, స్పెషల్ డేస్ కోసం 23 నోటిఫైడ్ సెలవులున్నాయి. ఇక ఆదివారం, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన లిస్ట్ ప్రకారం సెలవులు ఇలా ఉన్నాయి.
సాధారణ సెలవులు..
- జనవరి 1 – నూతన సంవత్సరం
- జనవరి 14 – భోగి
- జనవరి 15 – సంక్రాంతి
- జనవరి 26 – గణతంత్ర దినోత్సవం
- ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి
- మార్చి 7 – హోళీ
- మార్చి 22 – ఉగాది
- మార్చి 30 – శ్రీరామనవమి
- ఏప్రిల్ 5 – బాబు జగజ్జీవన్ రామ్ జయంతి
- ఏప్రిల్ 7 – గుడ్ ఫ్రైడే
- ఏప్రిల్ 14 – అంబేడ్కర్ జయంతి
- ఏప్రిల్ 22 – రంజాన్
- ఏప్రిల్ 23 – రంజాన్ తదుపరి రోజు
- జూన్ 29 – బక్రీద్
- జులై 17 – బోనాలు
- జులై 29 – మొహర్రం
- ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం
- సెప్టెంబరు 7 – కృష్ణాస్టమి
- సెప్టెంబరు 18 – వినాయక చవితి
- సెప్టెంబరు 28 మిలాద్-ఉన్-నబి
- అక్టోబర్ 2 – గాంధీ జయంతి
- అక్టోబర్ 14 – బతుకమ్మ ప్రారంభం
- అక్టోబరు 24 – విజయదశమి
- అక్టోబరు 25 – విజయదశమి తర్వాతి రోజు
- నవంబర్ 12- దీపావళి
- నవంబర్ 27- కార్తీక పూర్ణిమ/ గురునానక్ జయంతి
- డిసెంబరు 25 – క్రిస్మస్
- డిసెంబర్ 26 – బాక్సింగ్ డే