Credits: Google (Representational Image)

Hyderabad, Dec 19: రైల్వే సర్వీసుల రద్దుకు (Train Services Cancelled) సంబంధించి దక్షిణమధ్య రైల్వే (South Central Railway) కీలక ప్రకటన చేసింది. హసన్‌పర్తి-ఉప్పల్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే పనుల (Railway Work) కారణంగా డిసెంబరు 19 నుంచి జనవరి 13 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. మొత్తం 8 రైళ్లు రద్దు కానున్నాయని, కనిష్ఠంగా 12 రోజుల నుంచి గరిష్ఠంగా 26 రోజులపాటు ఈ రైళ్లు అందుబాటులో ఉండబోవని తెలిపింది. రద్దైన రైళ్ల వివరాలను వెల్లడించింది.

China Earthquake: చైనాలో భారీ భూకంపం.. 111 మందికి పైగా మృత్యువాత.. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు.. పెద్ద సంఖ్యలో కూలిపోయిన ఇళ్లు, భవనాలు (వీడియోతో)

డిసెంబరు 19 నుంచి జనవరి 13 వరకు రద్దైన రైళ్లు

  • కాజీపేట-హసన్‌పర్తి, బళ్లార్ష-కాజీపేట, కరీంనగర్‌-సిర్పూర్‌, సిర్పూర్‌-కరీంనగర్‌, కరీంనగర్‌-బోధన్‌ రైళ్లు

జనవరి 2 నుంచి 13 వరకు రద్దైన రైళ్లు

  • సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ రైళ్లు

డిసెంబరు 20 నుంచి జనవరి 14 వరకు రద్దైన రైలు

  • బోధన్‌-కరీంనగర్‌ రైలు

Covid in India: భారత్‌ సహా 38 దేశాల్లో కొత్త వేరియంట్, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు, కోవిడ్‌ టెస్టులకు సిద్ధంగా ఉండాలని సూచన