Hyderabad, AUG 30: వేల్ ఆఫ్ ద స్కై' (Whale of the Sky) గా పిలవబడే ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో (Airbus Beluga) విమానం.. శుక్రవారం హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. 'ఎయిర్ బస్ బెలూగా'(Airbus Beluga) అనే పేరు గల తిమింగలం ఆకారంలో ఉండే ఈ విమానం, ఇప్పటివరకు హైదరాబాద్ కు రెండు సార్లు రాగా.. మూడోసారి, శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానం చివరిసారిగా 2022 డిసెంబర్, 2023 ఆగస్టులో హైదరాబాద్ లో దిగింది. ఈ విమానాన్ని అధికారికంగా.. ఎయిర్ బస్ A300-608ST అని పిలుస్తారు. అయితే ఈ విమానం ఇంధనం కోసం, ఇంకా సిబ్బంది విశ్రాంతి కొరకు మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వస్తూ, మార్గ మధ్యలో ఉన్న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో శుక్రవారం తెల్లవారుజామున 12.17 గంటలకు ల్యాండ్ అయింది. ఆ తర్వాత ఇది మధ్యాహ్నం 3 గంటలకు థాయిలాండ్ బయలుదేరి వెళ్లింది. అంతకుముందు 2022 లో థాయిలాండ్ పట్టాయా ఎయిర్పోర్ట్ కు వెళ్తూ హైదరాబాద్ లో దిగింది.
వీడియో ఇదుగోండి
#WATCH | Rangareddy, Telangana: Airbus Beluga, the 'Whale Of The Sky' landed at Rajiv Gandhi International Airport earlier today.
(Visual Source: GMR PRO) pic.twitter.com/x8Kpgh2Ega
— ANI (@ANI) August 30, 2024
ఈ విమానం ఇతర వాటితో పోలిస్తే.. ప్రత్యేకంగా ఉంటుంది. దీనిని 'వేల్ ఆఫ్ ద స్కై' అని కూడా పిలుస్తారు. అయితే సంప్రదాయ కార్గో విమానాల్లో సాధ్యం కానీ కార్గోను తరలించడానికి దీన్ని ప్రత్యేకంగా తయారుచేశారు. దీని పొడవు 56 మీటర్లు(184 అడుగులు), రెక్కలు 44.84 మీటర్ల వెడల్పు(147 అడుగులు) కలిగి ఉంటుంది. దీని కార్గో హోల్డ్ 7.1 మీటర్లు( 23 అడుగులు) వ్యాసం కలిగి ఉంటుంది. దీనిని పారిశ్రామిక యంత్రాలు, శాటిలైట్ల రవాణాకు, ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ భాగాలైన రెక్కలు, ఫ్యూజ్ లెస్ సెక్షన్ లను తరలించడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ విమానం ఎక్కువ బరువుండే భారీ కార్గోలు అంటే దాదాపుగా ఇది 47 టన్నుల భారీ కార్గోను కూడా రవాణా చేయగలదు.