Amit Shah in Hyderabad: హైదరాబాద్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు చేరుకున్న అమిత్ షా, 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు, షా టూర్ లో హైలైట్స్ ఇవే..
Union Home Minister Amit Shah (Photo Credits: ANI)

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన అమిత్‌షాను కిషన్‌ రెడ్డి, మురళీధర్‌ రావు, దుబ్యాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, గోషా మహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌, ఈటల రాజేందర్, విజయ శాంతి, వివేక్ తో పాటు పలువురు నాయకులు స్వాగతం పలికారు.

బేగంపేట నుంచి రోడ్డు మార్గన రామంతపూర్‌ చేరుకున్న అమిత్‌ షా. సీఎఫ్‌ఎస్‌ఎల్‌ క్యాంపస్‌లోని నేషనల్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌ బయలు దేరారు.

దారుణం.. మతిస్థిమితం లేని బాలికపై వృద్ధులు గ్యాంగ్ రేప్, రాత్రంతా రూంలో బంధించి అత్యాచారం, తెలంగాణలో షాకింగ్ ఘటన వెలుగులోకి

తుక్కుగూడలో జరగనున్న ప్రజా సంగ్రామ యాత్ర ముంగింపు సభను బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఏకంగా 5 లక్షల మందితో సభను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. షా ఈ బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

అంతకు ముందు అమిత్ షా బీజేపీ కోర్‌ కమిటీ నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలపై షా కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్లు సమాచారం.