Hyderabad, FEB 12: శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన బండా ప్రకాశ్‌కు (Banda prakash) శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన బండా ప్రకాశ్‌ను ( TS Council Deputy Chairman) మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్‌ఎస్ నాయకులు (BRS) శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బండా ప్రకాశ్‌కు శాసన మండలిలో అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి, అరురీ రమేశ్, యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, మండలి మాజీ చీఫ్ విప్ బొడేకుంటి వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎస్ నాయకులు సమ్మారావు, వరంగల్ నాయకులు, తదితరులు డిప్యూటీ చైర్మన్‌ను సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ వరంగల్ ముద్దు బిడ్డ, బడుగు, బలహీన వర్గాల నాయకుడైన బండా ప్రకాశ్ డిప్యూటీ చైర్మన్ పదవికి మరింత వన్నె తేవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసన మండలి ప్రతిష్టను మరింత పెంచాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో డిప్యూటీ చైర్మన్ గా ఎన్నిక కావడం గొప్ప అవకాశం అన్నారు.