Alcohol | Image used for representational purpose (Photo Credits: IANS)

Hyderabad, July 6: తెలంగాణ ఆబ్కారీ శాఖ మందుబాబులకు శుభవార్త చెప్పింది. బీరు ధరల్ని తగ్గిస్తూ (Beer prices Slashed in TS) సర్కార్ నిర్ణయం తీసుకుంది. బీరు ధరపై 10 రూపాయలు (Beer prices in Hyderabad) తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఈ తగ్గింపు అన్ని బ్రాండ్ల బీర్లకు వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటిదాకా ఎక్సైజ్ సుంకం పేరిట సీసా ఒక్కింటికి రూ.30 అదనంగా వసూలు చేశారు. ఇప్పుడా ప్రత్యేక సెస్ నుంచి రూ.10 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు.

తగ్గింపు నేటి నుంచే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆబ్కారీ శాఖ వెల్లడించింది. కాగా, ఇప్పటికిప్పుడు తెలంగాణ సర్కారు బీర్ల ధర తగ్గించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. సాధారణంగా బీర్లకు వేసవిలో అత్యధిక డిమాండ్ ఉంటుంది. ఎండలు తగ్గడంతో బీర్లకు కూడా డిమాండ్ తగ్గుతుంది. ఈ నేపథ్యంలోనే బీర్ల ధరలు తగ్గించి ఉంటారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

తగ్గించిన ధర సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మద్యం దుకాణాల్లోని పాత స్టాక్ కు ఇది వర్తించదని అధికారులు తెలిపారు. కరోనా, లాక్ డౌన్ తో బీర్ల సేల్స్, ఆదాయం భారీగా తగ్గడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కరోనా కారణంగా గతేడాది మేలో సెస్‌ పేరుతో ప్రభుత్వం లిక్కర్‌ రేట్లను పెంచింది. దాదాపు 20 శాతం ధరలు పెరిగాయి. దీంతో రూ.120 ఉన్న బీర్ రూ.150కి చేరింది.

పరీక్షలు ప్రారంభం అయ్యాయి, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేం, స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు, చివరి క్షణం వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నలు

అయితే అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లోనూ 10 నుంచి 15 శాతం లిక్కర్‌ రేట్లు పెంచారు. కానీ ఫస్ట్‌ వేవ్‌ లాక్‌డౌన్‌ ముగియడంతో ఆయా రాష్ట్రాలు సెస్‌ను ఎత్తేశాయి. ఢిల్లీ సర్కార్ కరోనా తగ్గకముందే ఎత్తేసింది. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత స్వల్పంగా తగ్గించింది. అప్పుడు రూ.30 పెంచి, ఇప్పుడు రూ.10 మాత్రమే తగ్గించింది.