Telangana High Court: పరీక్షలు ప్రారంభం అయ్యాయి, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేం, స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు, చివరి క్షణం వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నలు
High Court of Telangana | (Photo-ANI)

Hyderabad, July 6: తెలంగాణలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు (Telangana High Court) నిరాకరించింది. పరీక్ష 10 గంటలకు ప్రారంభమయ్యాక వాటిని నిలిపివేయాలంటూ అభ్యర్థించడాన్ని తప్పుబట్టింది. చివరి క్షణం వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పరీక్షలు ప్రారంభమైనందును (Degree, PG, Engineering‌ Examinations) అందులో జోక్యం చేసుకోలేమని తెలిపింది.

కొవిడ్‌ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ తదితర పరీక్షల నిర్వహణను నిలిపివేసి ఆన్‌లైన్‌లో నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై భోజన విరామ సమయంలో అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి సోమవారం ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ముందు అభ్యర్థించారు. జిల్లాల నుంచి విద్యార్థులు నగరాలకు రావాల్సి ఉందని, ఇక్కడ వసతిగృహాలు కూడా లేవన్నారు.

ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌, హైద‌రాబాద్‌లో బాలానగర్‌ ప్లై ఓవర్‌ ప్రారంభం, మున్సిపల్ కార్మికురాలితో రిబ్జన్ కటింగ్ చేయించిన మంత్రి కేటీఆర్, బాలానగర్‌ ఫ్లైఓవర్‌ ఇకపై జగ్జీవన్‌రామ్‌ వంతెనగా పేరు మార్పు

కరోనా ప్రమాదం పొంచి ఉన్నందున ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించేలా ఆదేశివ్వాలని కోరగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఇక ఓయూ పరిధిలో నేటి నుంచి ప్రారంభం అయిన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కంట్రోలర్‌ శ్రీరామ్‌ వెంకటేశ్‌ సోమవారం తెలిపారు. కరోనా వ్యాప్తి కారాణంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

నేటి నుంచి వివిధ డిగ్రీ కోర్సుల 3, 5 సెమిస్టర్‌ పరీక్షలు, ఈనెల 27 నుంచి 6, 1 సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యూనివర్సిటీ వెబ్‌సైట్లో పరీక్షల టైం టేబుల్‌ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. గతంలో జారీచేసిన హాల్‌టికెట్లు, ఇంతకు ముందు ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయన్నారు.