భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి వేడుకలను తిలకించేందుకు శనివారం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అందంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీరాముడు, వేద మంత్రోచ్ఛారణలు, అర్చకుల హారతి మధ్య విష్ణుమూర్తి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి విశిష్టతను స్థానాచార్యులు భక్తులకు వివరించారు. భద్రాద్రి ఆలయంలో 24 రోజుల వార్షిక వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా ఉత్తర ద్వార దర్శనం అనేది ఒక ముఖ్యమైన ఆచారం. ఇది 10-రోజుల ఉత్సవ 'పగల్పట్టు' ఉత్సవాల ముగింపు మరియు మూడు రోజుల 'విలాసొస్తవం'ల తర్వాత 10 రోజుల 'రాపట్టు' ఆచారాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఉత్తర ద్వార దర్శనం అనంతరం తిరువీధి సేవ నిర్వహించారు. గరుడవాహనంపై శ్రీరాముడు, గజవాహనంపై సీతాదేవి, హనుమత్ వాహనంపై లక్ష్మణులను ఆలయ పట్టణంలోని మాడవీధిలో ఊరేగించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక ఆలయం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ డా.వినీత్ జీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేడుకలను సజావుగా నిర్వహించినందుకు అధికారులను కలెక్టర్ అభినందించారు.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, భద్రాచలం, పినపాక, యెల్లందు, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు డా. తెల్లం వెంకట్‌రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, ఏఎస్పీ పరితోష్ పంకజ్, దేవస్థానం ఈఓ రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోయంబత్తూర్ కు చెందిన బాలాజీ శారద అనే భక్తులు భద్రాద్రి రామచంద్రుడికి 45 లక్షల రూపాయల విలువైన 109 బంగారు తులసీ దళాలను కానుకగా సమర్పించారు.