Hyderabad, March 03: భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత తెల్లం వెంకట్రావు (Tellam Venkata Rao) కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Cm Revanth Reddy) కలిశారు. మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెల్లం వెంకట్రావు రేవంత్ రెడ్డి వద్దకు వచ్చారు. వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరతారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌తో కలిసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లగా తెల్లం వెంకట్రావు మాత్రం వారితో వెళ్లలేదు. దీంతో వెంకట్రావు పార్టీ మారతారన్న అనుమానాలు బలపడ్డాయి. లోక్‌సభ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డిని ఆయన కలవడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కుటుంబసమేతంగా మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు.#CMRevanthReddy pic.twitter.com/NQk7Z17j4v
— Yashwanth Reddy 🇮🇳 (@Yashwanth_INC) March 3, 2024
మరోవైపు, లోక్‌సభ ఎన్నికల వేళ రామగుండం కార్పొరేషన్‌లోనూ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. మేయర్ బంగి అనిల్ కుమార్ సహా 20 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖమంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్‌తో కలిసి వారంతా గాంధీభవన్‌కు వెళ్లనున్నారు.