TSRTC bus (Photo-Video Grab)

Hyderabad, April 17: శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (TSRTC MD Sajjanar) తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలియజేశారు. భద్రాచలంలో ఇవాళ జరిగే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను (Talambralu) రాష్ట్రంలోని భక్తులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని TSRTC యాజమాన్యం నిర్ణయించిందని ఆయన సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి ఆర్టీసీ (TSRTC) శ్రీకారం చుట్టిందని సజ్జనార్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలను కోరుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

 

అదేవిధంగా టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగ వెబ్సైట్ https://tsrtclogistics.in ను సందర్శించి కూడా తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని సజ్జనార్‌ సూచించారు. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం పవిత్ర తలంబ్రాలను కోరుకున్న భక్తులకు టీఎస్‌ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుందని తెలిపారు.