BJP Flag. File photo

హైదరాబాద్‌లోని నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో బీజేపీ రాష్ట్ర శాఖ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణను ప్రగతిపథంలో నడిపేందుకు 10 అంశాల కార్యాచరణను బీజేపీ నేతలు ప్రకటించారు. ధరణి స్థానంలో మీ భూమి యాప్ అందుబాటులోకి తెస్తామని.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు.

> బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ

>> ధరణికి బదులుగా మీ భూమి యాప్‌.

>> ప్రజలందరికీ సుపరిపాలన, సమర్థవంతమైన పాలన

>> విత్తనాల కొనుగోలుకు రూ.2500 ఇన్‌పుట్‌

>> 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం

>> మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పొరేషన్‌

>> యువశక్తి-ఉపాధి.. యూపీఎస్సీ తరహాలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణ

>> ఈడబ్ల్యూఎస్‌ కోటాతో సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల్లో భర్తీ చేస్తాం

>> వైద్య శ్రీ కింద ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా

>> గల్ఫ్‌ బాధితుల కోసం నోడల్‌ ఏజెన్సీ

>> కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ

>> మండల కేంద్రాల్లో నోడల్‌ స్కూళ్ల ఏర్పాటు

>> వరికి రూ.3100 మద్దతు ధర

>> నిజామాబాద్‌లో టర్మరిక్‌ సిటీ

>> ఆడబిడ్డ భరోసా కింద 21 ఏళ్లు వచ్చేనాటికి రూ.2 లక్షలు అంద జేత

>> లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్‌ సిలిండర్లు ఫ్రీ

>> సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను రీయింబర్స్‌మెంట్‌

>> అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు

>> స్వయం సహాయక బృందాలకు 1 శాతం వడ్డీతోనే రుణాలు

>> రైతులకు ఉచితంగా దేశీ ఆవులు

>> రైతులకు ఉచితంగా పీఎం పంటల బీమా

>> వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ టూర్లు

>> ఉమ్మడి పౌరస్మృతి కోసం కమిటీ ఏర్పాటు

>> మేడారం జాతరకు జాతీయ స్థాయిలో గుర్తింపు

>> నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు

>> బీఆర్‌ఎస్‌ అవినీతిపై విచారణకు కమిటీ

>> ఎస్సీ వర్గీకరణకు సహకారం

>> బడ్జెట్‌ స్కూళ్లకు పన్ను మినహయింపులు

>> ఘుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ

>> పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు

>> మేడారం జాతర జాతీయ స్థాయిలో నిర్వహణ

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది