Hyderabad, DEC 09: మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కోలుకుంటున్నారు. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స (KCR Health) అనంతరం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. త్వరితగతిన కోలుకోవడానికి (KCR Recovering) అనుకూలంగా కేసీఆర్ శరీరం సహకరిస్తోందని, ఆయన మానసికంగా కూడా దృఢంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో వాకర్ సాయంతో వైద్యులు కేసీఆర్ ను నడిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. వైద్యులు మాట్లాడుతూ.. ఫిజికల్లీ మెంటల్లీ కేసీఆర్ స్ట్రాంగ్ గా ఉన్నారని, మరో రెండుమూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. 6 నుంచి 8 వారాల రెస్ట్ అవసరం ఉంటుందని అన్నారు. తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేసిన పేషెంట్లను వారివారి శారీరక మానసిక సామర్థ్యాన్ని పరిశీలించి వారిని మొబిలైజేషన్ స్టార్ట్ చేస్తారని వైద్యులు తెలిపారు. ఇందులో భాగంగా కేసీఆర్ ను బెడ్ బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టి వాకర్ సాయంతో నడిపించే ప్రయత్నం చేశామని చెప్పారు.
నిన్న జరిగిన తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం అవడంతో.. వైద్యుల పర్యవేక్షణలో నడుస్తున్న బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్. pic.twitter.com/ioPfAepsa8
— BRS Party (@BRSparty) December 9, 2023
డాక్టర్ ప్రవీణ్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి లో ప్రోగ్రెస్ బాగుంది. చాలా వేగంగానే రికవరీ అవుతున్నారు. వాకర్ తో బెడ్ బయటకు వచ్చి కూర్చున్నారు. వాకర్ సాయంతో మేము రూమ్ లో నడిపించే ప్రయత్నం చేసినపుడు కేసీఆర్ శరీరం బాగా స్పందించిందని చెప్పారు. వారు రూమ్ లో వాకర్ సాయంతో నడిచారు. దీన్ని మెడికల్ పరిభాషలో “ మొబిలైజేషన్ స్టార్ట్” అంటారు. హిప్ రీప్లేసెమెంట్ జరుగగానే పేషెంట్ ను నడిపించే ప్రయత్నం చేస్తాం. వారు ఆపరేషన్ నొప్పి తగ్గి “మినిమల్ పెయిన్” తో కోలుకుంటున్నారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లుకూడా చేయిస్తున్నాం. మెడికల్ గా స్టేబుల్ గా ఉన్నారు. వారి బాడీ బాగా సహకరిస్తుందని ప్రవీణ్ రావు తెలిపారు. కేసీఆర్ మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్నారు. నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నారు. మరికొద్ది రోజులపాటు ఫిజియో థెరఫీ కొనసాగించాల్సి వుంటుంది. ఇట్లానే శరీరం సహకరిస్తే మరో రెండు మూడు రోజుల్లో కేసీఆర్ ను డిశ్చార్జ్ చేస్తామని యశోద డాక్టర్ ప్రవీణ్ రావు తెలిపారు.