KCR Sensational Comments: నిరోద్ లు అమ్ముకోమ్మ‌ని కాంగ్రెస్ నేత‌లంటే ఈసీకి క‌నిపించ‌దా? నా యాత్ర‌తో కాంగ్రెస్, బీజేపీల‌కు గుండెల్లో వ‌ణుకు పుడుతోంద‌న్న కేసీఆర్, ఈసీ నిషేదం ముగిసిన త‌ర్వాత తొలి రోడ్ షో
KCR

Peddapalli, May 03: నా బ‌స్సు యాత్ర‌తో కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెలు వ‌ణుకుతున్నాయ‌ని బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR Sensational Comments) స్ప‌ష్టం చేశారు. ఇద్ద‌రు కుమ్మ‌క్కై న‌న్ను నిలువ‌రించాల‌ని నా ప్ర‌చారంపై నిషేధం విధించారు అని కేసీఆర్ తెలిపారు. పెద్ద‌ప‌ల్లి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రామ‌గుండంలో నిర్వ‌హించిన రోడ్ షోలో కేసీఆర్ (KCR Road Show) పాల్గొని ప్ర‌సంగించారు. 48 గంట‌ల త‌ర్వాత నిషేధించ‌బ‌డిన నా గొంతు మ‌ళ్లీ మాట్లాడుతుంది. నేను ఏం చేశాన‌ని నా గొంతును ఆపారు. ఎందుకు కోసం నా గొంత‌ను నొక్కేశారు. ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఆర్డ‌ర్లు ఇవ్వ‌డం లేద‌ని, గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన ఆర్డ‌ర్ల బిల్లులు చెల్లించ‌డం లేద‌ని, నేత‌న్న‌లు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని బీఆర్ఎస్ నేత‌లు ప్ర‌శ్నిస్తే.. మీరు మొన్న‌టిదాకా దొబ్బిత‌న్న‌ది చాలాదా..? అని కాంగ్రెస్ నాయ‌కుడు మాట్లాడిండు. నిరోధ్‌లు, పాప‌డాలు అమ్ముకోండి అని ఆ కాంగ్రెస్ నేత‌ మాట్లాడారు. చేనేత‌ కార్మికులంటే అల‌క‌గా క‌న‌బ‌డుతున్నారా..? అని కోపంలో ఒక మాట మాట్లాడాను. రూ. 370 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, వాటిని విడుద‌ల చేయాల‌ని అడిగితే నిరోధ్‌లు అమ్ముకోండి అంటే కోపంతో ఒక మాట అన్నాను అని కేసీఆర్ తెలిపారు.

Graduate BRS MLC Candidate: ఎమ్మెల్సీ అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్-ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల స్థానం నుంచి బ‌రిలోకి దిగేది ఆయ‌నే! 

నేను బ‌స్సు యాత్ర చేప‌ట్టిన త‌ర్వాత కాంగ్రెస్ (Congress), బీజేపీకి (BJP) గుండెలు వ‌ణుకుతున్నాయి.ఇద్ద‌రు కుమ్మ‌క్కై నిలువ‌రించాల‌ని కుట్ర చేశారు.. ప్ర‌చారంపై బ్యాన్ పెట్టారు. నేను ఇక్క‌డికి 2 గంట‌ల ముందే ఉంచాను. బ్యాన్ ఉన్నందుకు 8.15 త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చాను. రాజ‌కీయాల్లో మ‌తం గురించి మాట్లాడ‌టం ఎన్నిక‌ల నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. కానీ అమిత్ షా త‌న చేతిలో దేవుడి బొమ్మ పెట్టుకుని మాట్లాడుతుంటే ఈసీకి క‌నిపించ‌దు. ప్ర‌ధాని మోదీ హిందువులు ముస్లింలు అని మాట్లాడితే ఈసీకి క‌నిపించ‌దు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏం చేశావ‌ని అడిగితే గుడ్లు పీకి గోలీలు ఆడుతాం, పండ‌వెట్టి తొక్కుతాం అని మాట్లాడితే ఈసీకి క‌న‌బ‌డ‌దు. చేనేత కార్మికుల ప‌క్షాన మాట్లాడితే ఈ ర‌కంగా బ్యాన్ చేశారు. ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెల‌వాల‌నేది ప్రజలే నిర్ణయిస్తారు అని కేసీఆర్ పేర్కొన్నారు.