Hyderabad, June 20: ఏపీ ఎన్నికల్లో టీడీపీ (AP Election Results) గెలుపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 16 ఎంపీ స్థానాలను సాధించిన టీడీపీ (TDP).. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగిందన్నారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లతో ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) ఎద్దేవా చేశారని.. ఎక్కువ సీట్లు వస్తే కేంద్రంలో నిర్ణయాత్మకంగా ఉండొచ్చని కేసీఆర్ (KCR) అన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ”8 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. బీజేపీతో కలిసి సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు అడుగులు వేస్తోంది. సింగరేణి ప్రైవేటీకరణ వద్దని ప్రధాని మోదీకి అప్పట్లో కేసీఆర్ లేఖ రాశారు. అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్ కూడా దీన్ని సమర్ధించారు. సింగరేణిపై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వేలంలో పాల్గొంటామని ఎందుకు చెప్పారు? సింగరేణి విషయంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయి.
LIVE : BRS Working President @KTRBRS addressing the media at Telangana Bhavan https://t.co/1INIbRxZgn
— BRS Party (@BRSparty) June 20, 2024
కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కేంద్రం కుట్రలు ఇక్కడ సాగలేదు. కిషన్ రెడ్డి (Kishan Reddy) సింగరేణి అమ్మాలంటారు. సీఎం రేవంత్ వేలంలో పాల్గొనాలని అంటారు. సింగరేణి ప్రైవేటీకరణ ను బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మేము రద్దు చేస్తాం. వేలం పాటలో పాల్గొనే సంస్థలను హెచ్చరిస్తున్నాం. బొగ్గు గనుల వేలం ఉపసంహరించుకోవాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.