BRS Ex MLA Shakeel Son Raheel Arrested: ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ అరెస్ట్‌… దుబాయ్ నుంచి వస్తున్నాడన్న సమాచారంతో అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు
BRS Ex MLA Shakeel Son Raheel Arrested (Credits: X)

Hyderabad, Apr 8: బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే షకీల్ (Shakeel) కుమారుడు రహీల్ (Raheel) ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ప్రజాభవన్ (Prajabhavan) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కేసులో రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత షకీల్ తనయుడు దుబాయ్‌ కు పారిపోయాడు. రహీల్ పై పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు యాక్సిడెంట్ తర్వాత ఘటన ప్రదేశం నుంచి తప్పించుకుని తన స్థానంలో మరొకరి బాధ్యుడిగా చూపించాడు రహీల్.

ఈవ్యవహారంలో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై కూడా వేటు పడింది. అయితే, తాజాగా దుబాయ్ నుంచి రహీల్ హైదరాబాద్ వస్తున్నాడని తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు, అతన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.