Hyd, Sep 6: మలిదశ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఇకలేరు. బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు జిట్టా.
బీఆర్ఎస్ నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసేందుకు తనవంతు పాత్రను పోషించారు. బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు జిట్టా. భువనగిరి నుండి పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
నల్గొండ జిల్లాలో ప్రధానంగా భువనగిరి ప్రాంత అభివృద్ధికి తనవంతు పాత్ర పోషించారు జిట్టా. ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న ప్రజలను చూసి చలించిపోయి ప్రతి గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు నెలకొల్పారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. నిత్యం ప్రజల కోసం పరితపించే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు జిట్టా.
Here's Tweet:
జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత ..
సాయంత్రం భువనగిరిలో అంత్యక్రియలు https://t.co/g6gVJvRbey pic.twitter.com/CcFEqd0x0t
— Telugu Scribe (@TeluguScribe) September 6, 2024
అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు మెయింటెన్ చేశారు జిట్టా. ఇవాళ సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. భువనగిరి శివారులోని మగ్దుంపల్లి రోడ్డులో గల ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరగనున్నాయి.