
Hyderabad, Mar 17: రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీఎం (CM) అవుతారని తాను ఎప్పుడో చెప్పానని, ఈ విషయాన్ని మొదట చెప్పింది కూడా తానేనని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) అన్నారు. 2014లో బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న ఇచ్చిన విందుకు హాజరైన సందర్భంలో తాను స్వయంగా రేవంత్ రెడ్డితో ఈ విషయం చెప్పినట్లు తెలిపారు. కాగా, త్వరలో మల్లారెడ్డి పార్టీ మారనున్నారని ఇటీవల గుసగుసలు వస్తుండటం తెలిసిందే.
