Hyd, Sep 6: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈజ్ బ్యాక్. రుణమాఫీపై రణం చేసేందుకు త్వరలోనే జిల్లాల పర్యటన చేపట్టనున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో నవగ్రహ మహాయాగం చేపట్టారు కేసీఆర్. సతీమణి శోభతో కలిసి వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్. ఇక తెలంగాణలో యాగం అనగానే గుర్తుకు వచ్చేది కేసీఆరే.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 2015లో చండీయాగం చేపట్టారు కేసీఆర్. ఆ తర్వాత 2018, 2024లో రాజశ్యామల యాగం చేపట్టారు. ఇప్పుడు నవగ్రహ మహాయాగం చేశారు కేసీఆర్.
ఈ నెల 11వ పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యచరణ సిద్ధం చేశారు. ఇదే అంశంపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్.
Here's Tweet:
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో వేద పండితులతో నవగ్రహ మహాయాగం చేపట్టారు. తన సతీమణి శోభతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇందులో కేసీఆర్ కూతురు కవిత కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా KCR 2015లో చండీయాగం, 2018, 2024లో రాజశ్యామల యాగం చేపట్టిన సంగతి… pic.twitter.com/c0oYxoSn3v
— ChotaNews (@ChotaNewsTelugu) September 6, 2024
రుణమాఫీపై ప్రతీ జిల్లాలోనూ ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు గులాబీ బాస్. ఈ నెల 18వ తేదీ నుంచి జల్లా పర్యటనలు ఉండనున్నట్లు తెలుస్తోండగా కేసీఆర్ యాగంకు సంబంధించిన వార్త తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.