Hyderabad, Dec 8: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై (Telangana Assembly) సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ జరుగనుంది. అందులో తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ హాజరు కావాల్సిందిగా అల్టిమేటమ్ జారీ చేశారు. అయితే, ఎంతమంది హాజరు అవుతారన్న సస్పెన్స్ కొనసాగుతుంది. కాగా హైడ్రా, మూసీ ప్రక్షాళన సహా పలు అంశాలపై ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. ఇదే అంశంపై నేటి భేటీలో చర్చించనున్నట్టు సమాచారం.
నేడు KCR అధ్యక్షతన BRSLP సమావేశం
మధ్యాహ్నం ఒంటగంటకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్న BRS అధ్యక్షుడు కేసీఆర్..
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో.. అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్న కేసీఆర్..@BRSparty @KCRBRSPresident pic.twitter.com/FKQnp7nJ5i
— Telangana Awaaz (@telanganaawaaz) December 8, 2024
కేసీఆర్ వస్తారా??
మాజీ సీఎం కేసీఆర్ రేపటి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా లేదా అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక వేళ కేసీఆర్ అసెంబ్లీకీ వస్తే రాజకీయాలు ఎలా ఉంటాయో అని పొలిటికల్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది. గత అసెంబ్లీ సమావేశాలకు కూడా గులాబీ బాస్ హాజరుకాలేదు. దీంతో తాజాగా కేసీఆర్ అసెంబ్లీకీ రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.