Hyderabad, April 12: ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను లై డిటెక్టర్ విచారణకు సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన టీవీ9 లైవ్ షో కార్యక్రమంలో కేటీఆర్ పేర్కొన్నారు. ‘100 రోజుల పాలనపై లోక్ సభ ఎన్నికలు రెఫరెండం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 17 స్థానాల్లో మల్లయుద్ధాలు ఎందుకు.. మల్కాజిగిరి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సీటు.. అందుకే మల్కాజిగిరికి రమ్మనండి.. ఒక్కసీటులో ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందాం..దీని మీద మేం డిమాండ్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి నోరు మెదపడం లేదు’ అని చెప్పారు.
లై డిటెక్టర్ టెస్ట్ కి నేను రెడీ.. రేవంత్ , కిషన్ రెడ్డి రెడీనా ? : KTR Exclusive Interview - TV9#ktr #crossfire #rajinikanthvellalacheruvu #rajinikanthtv9 #tv9telugu pic.twitter.com/3u0RhfjPx3
— TV9 Telugu (@TV9Telugu) April 12, 2024
‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ట్యాపింగ్ (Phone Tapping) జరిగిందా.. లేదా.. అన్నది కోర్టులు తేల్చాలి. నేను ఏ తప్పు చేయలేదు.. చేస్తే ఎవరైనా శిక్షార్హుడే..కానీ మీడియాలో ట్రయల్ జరుగుతున్నది ఇది తప్పు. యూట్యూబ్ ల్లో ప్రచారం వాంచనీయం కాదు. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పుదోవ పట్టించడానికే ఈ ప్రచారం అంతా.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతున్నది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.