Hyderabad, AUG 23: దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ (Complaint To DGP) చేశారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్‌తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఉన్నారు.
రాష్ట్ర డీజీపీని కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మరియు పార్టీ సీనియర్ నాయకులు.
నిన్న తిరుమలగిరిలో కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ పార్టీ ధర్నా శిబిరంపై చేసిన దాడి పై ఫిర్యాదు
రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారని నాయకులు అన్నారు
పోలీసులు స్వయంగా ధర్నా… pic.twitter.com/ZDKjdJmcS2
— BRS Party (@BRSparty) August 23, 2024
నిన్న కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కవరేజ్ కోసం వెళ్లిన మహిళా జర్నలిస్ట్‌లపై దాడి జరిగిన విషయం విదితమే. దోషులను గుర్తించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని మహిళా జర్నలిస్టులు కూడా డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి వెళ్లిన మహిళా జర్నలిస్టులపై పట్టపగలే దాడి జరిగింది.