KTR's Challenge to CM Revanth Reddy (photo-File Image)

Hyderabad, March 09: ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌లో (LRS Scheme) ఎలాంటి చార్జీలు లేకుండా భూములను రెగ్యులరైజ్‌ చేసేందుకు వెంటనే మార్గదర్శకాలు (LRS Scheme) విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR Letter) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) కేటీఆర్‌ లేఖ రాశారు. ఈ సందర్భంగా ప్రస్తుత మంత్రులు గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలని.. లేదంటే గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు, అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 

ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న మీరు.. ఈ రోజు ప్రజలనెందుకు దోపిడీ చేస్తున్నారో వివరించాలన్నారు. ప్రతిపక్షంగా ప్రజల డిమాండ్‌ను తమ నిరసన కార్యక్రమం, వినతిపత్రాల రూపంలో ప్రభుత్వానికి అందించామన్న కేటీఆర్‌.. ప్రజల ఆకాంక్షల మేరకు ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేయాలని.. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు చేసిన హామీలు మాట్లాడిన మాటలను తన లేఖలో ప్రస్తావించారు.