
Hyderabad, DEC 19: ఫార్ములా – ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి చేసేది లత్కోర్ పని అని ధ్వజమెత్తారు కేటీఆర్. ఫార్ములా -ఈ రేస్‌పై (Formula E Car Race) అసెంబ్లీలో చర్చించేందుకు రేవంత్ సర్కార్ భయపడుతోందని కేటీఆర్ (KTR Press Meet) తేల్చిచెప్పారు. ఈ కేసు వ్యవహారంపై తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గత రెండు రోజులుగా స్పీకర్‌ను కోరాం.. సభ నడుస్తోంది. కుంభకోణం లంబకోణం అని కేబినెట్‌లో పరిశోధించి.. ఏదో సాధించినట్లు లీకులు ఇస్తున్నారు. నాలుగు గోడల మధ్య నలుగురు సన్నాలు మాట్లాడుడు ఏంటి..? నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చ పెడుదాం.. దూద్ కా దూద్ పానీ కా పానీ అయితదిని చెప్పినం. కానీ ప్రభుత్వం భయపడుతోంది.
వాళ్లకు కూడా తెలుసు.. ఇందులో ఏం లేదు.. చేసేది లత్కోర్ పని సాటుమాటుగా చేయాలి.. ఓపెన్‌గా చేస్తే ఇజ్జత్ పోతదని భయపడుతున్నారు.
BRS Working President KTR on ACB Case
ఫార్ములా - ఈ రేస్ తో తెలంగాణకు, హైదరాబాద్ కు ఏం లాభం వచ్చింది?
నెల్సన్ అనే ఇంటర్నేషన్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ను బయటపెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/G7LUC5EsxA
— BRS Party (@BRSparty) December 19, 2024
దమ్ముంటే చర్చ పెట్టాలని స్పీకర్‌ను అడిగాను. చర్చకు రాలేదు. నిన్న సీఎంకు లేఖ రాశాను. కేసు అంటున్నావ్ కదా.. చర్చ పెట్టమంటే దమ్ము లేదు. ఈ విషయం మీద చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదు. ఫార్ములా -ఈ రేస్ గురించి ప్రభుత్వానికి తెలియదు. సీఎం చర్చలో పాల్గొని కళ్లల్లో కళ్లు పెట్టి ధైర్యంగా నిరూపించే శక్తి లేదు. ఏదో ఒక కేసు పెట్టాలని శాడిస్ట్ మెంటాల్టి తప్ప ఇంకోటి లేదు. తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశానని కేటీఆర్ తెలిపారు.