CM KCR Speech in Assembly

Hyd, August 7: ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ మాదిరిగా అలవికా నీ హామీలు ఇచ్చి, ప్రజలను వంచించబోమని సీఎం కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తమ అమ్ములపొదిలో మరిన్ని అస్ర్తాలు ఉన్నాయని చెప్పారు.

కర్ణాటకలో ఎన్నికలు రాగానే ఇంటికి అర లీటరు పాలు, ఉచిత సిలెండర్‌ ఇస్తామని బీజేపీ వాళ్లు హామీలు ఇచ్చారు. కానీ ఏమైంది? ప్రజలు ఈడ్చి కొట్టారు. అట్లనే ఉన్నది మన దగ్గర కాంగ్రెసోళ్ల తీరు. అన్నీ అలవికాని హామీలు ఇస్తారు. ఖమ్మంలో సభ పెట్టి రూ.4 వేలని ఒక నంబర్‌ చూపించి వెళ్లారు. గెలిచేదా? సచ్చేదా? బరువా? బాధ్యతనా? అందుకే అట్ల మాట్లాడుతున్నారు. ఇట్లాంటి హామీలే కర్ణాటకలో ఇచ్చారు. ఇప్పుడేమో పైసలు లేవు.. ఏమి చేద్దామని కర్ణాటక ముఖ్యమంత్రి తల పట్టుకుంటున్నారు. ఇవాళే పత్రికల్లో కూడా వచ్చింది- ఎస్సీ, ఎస్టీ నిధులు మళ్లించి వాగ్ధ్దానాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నరని. ఇదీ.. అక్కడి కాంగ్రెస్‌ పరిస్థితి. చెయ్యగలిగిందే చెప్పాలి. చెప్పింది ధైర్యం గా చెయ్యాలి.

వీడియో ఇదిగో, కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్‌ను చాలా ఇబ్బందులు పెట్టింది, సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు ఇదిగో..

4 ఓట్ల కోసం ఇష్టం వచ్చింది చెప్పి.. అలవికాని హామీలు ఇవ్వడం ఎం దుకు? ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఇస్తున్న పింఛన్‌ ఎంత? ఏ ఒక్క రాష్ట్రంలోనూ వెయ్యి రూపాయలకు మించి పింఛ న్‌ ఇవ్వడం లేదు. కానీ, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.4 వేలు ఇస్తారట. కాం గ్రెస్‌ విషయంలో గతంలోనూ మనకెన్నో అనుభవాలు ఉన్నాయి. ఇదే రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్‌ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. కానీ, మేం కాంగ్రెసంత గొప్పోళ్లం కాదని, రూ.1లక్ష వరకే మాఫీ చెస్తామని చెప్పాం. మాకు 88 సీట్లు వస్తే.. కాంగ్రెస్‌కు 19 సీట్లే వచ్చినయ్‌. అలవికానియి చెప్తే.. ఎటుబడితే అటు మాట్లాడితే ప్రజలు నమ్మరు. ఏది, ఎప్పుడు, ఎట్ల పెంచాలో మాకు తెలుసు. ఒక్కసారే పెం చం. క్రమపద్ధతిలో పెంచుకుంటూ వెళ్తాం.

కాంగ్రెసోళ్లు అనుకుంటున్నారు అలవికానివేవో చెప్పేసి అధికారం కొట్టుకుపోదామని. కానీ, మా దగ్గర ఇంకా ప్రజలకు కావాల్సినవి, మేం నెరవేర్చగలిగినవి గంపెడు ఉన్న య్‌. కొత్త అస్ర్తాలు మస్తుగున్నయ్‌. ప్రజలను సంక్షేమబాట పట్టించినది, రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది, సంక్షేమాన్ని అమలు చేసి నడిపిస్తున్నదే మేము. అన్నీ దశలవారీగా అమలుచేస్తాం.

రాష్ట్రం ఏర్పడిన కొ త్తలో ఆర్థిక పరిస్థితి ఎట్లుంటదో అర్థం కాలేదు. అందుకే.. పింఛన్‌ మొదట వెయ్యి రూపాయలే ఇచ్చినం. ఆ తర్వాత ఆర్థికంగా బలపడుతూ రూ.2 వేలు చేసినం. కల్యాణలక్ష్మి మొదట్లో రూ.51 వేలు ఇచ్చుకున్నం. తర్వాత రూ.లక్షకు పెంచుకున్నం. గొర్రెల పంపిణీలో యూనిట్‌కు రూ.లక్ష ఆ తర్వాత రూ.1.75 లక్షలకు పెంచాం. రైతుబంధును రూ.4 వేలతో ప్రారంభించాం. తర్వాత రూ.5 వేలకు పెంచాం. రాబోయే రోజుల్లో ఇంకెంత పెంచగలమో ఆలోచన చేస్తాం. ఆ దిశగా పెంచుకుంటూ వెళ్తాం.

వనమా వెంకటేశ్వరరావు అనర్హత వేటుపై స్టే విధించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా

కాంగ్రెస్‌ వేసిన అనేక పీటముడుల్లో సీపీఎస్‌ (కాంట్రీబ్యూటరీ పెన్షన్‌) ఒకటి. దీనిని కాంగ్రెస్‌ తెచ్చింది. బీజేపీ కొనసాగిస్తున్నది. ప్రభుత్వ, ఉద్యోగ భాగస్వామ్యంతో పెన్షన్‌ ఫండ్‌ను ఏర్పాటుచేశారు. కానీ, దానిని తిరిగి రిటైర్డ్‌ ఉద్యోగులకు చెల్లించడానికి కేంద్రం సిద్ధంగా లేదు. ఇందులో ఏమి చేయవచ్చో? ఏమి చేయకూడదో? అనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. సీపీఎస్‌ విషయంలో కొన్ని రాష్ర్టాల్లో కొన్ని పద్ధతులు, మరికొన్ని రాష్ర్టాల్లో మరికొన్ని పద్ధతులున్నాయి.

తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన పెట్టుబడులు రూ.2 లక్షల 51 కోట్లు. తద్వారా 20 లక్షల పరిశ్రమల స్థాపన జరిగింది. 17.21 లక్షల ఉద్యోగాలు వచ్చినయ్‌. ఇవన్నీ వట్టిగనే.. తమాషా చేస్తే అయితయా? 40,50 ఏండ్ల కాంగ్రెస్‌, చంద్రబాబు పరిపాలనలో 3 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉంటే.. మా తొమ్మిదిన్నర ఏండ్ల పరిపాలనలో 6.17 లక్షల ఉద్యోగులను చేర్చినం. హైదరాబాద్‌ ఐటీ రంగంలో మొత్తం ఉద్యోగులు 9.15 లక్షలు. సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు రూ.57,258 కోట్లు ఉంటే.. రూ.2,47,275 కోట్లకు పెరిగింది. నిబద్ధత, క్రమశిక్షణతోనే ఇవన్నీ సాధ్యం అవుతాయి. టీఎస్‌ఐపాస్‌తో పారదర్శక విధానాన్ని తీసుకొచ్చాం. పరిశ్రమలు పెరుగుతున్నయ్‌. టీఎస్‌ బీపాస్‌తో ఎన్నో అద్భుతాలు చేశాం.

ఇటీవలే జైన సంఘానికి జాగ ఇచ్చాం. జైన్‌ పెద్దాయన ఒకరు నన్ను కలిశారు. ‘సార్‌.. టీఎస్‌బీపాస్‌ అద్భుతంగా ఉన్నది. నాకు ఒక్కడే కొడుకు. 11 వెంచర్లు వేస్తున్నాం. ఇద్దరు కొడుకులు ఉంటే 20 వెంచర్లు వేసుకునేటోణ్ణి. అంత అవకాశం ఉన్నది హైదరాబాద్‌లో..’ అని చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే చకచకా పని పూర్తయిపోతున్నది.

ప్రపంచంతో పోటీ పడే స్థాయికి హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌ ఎదుగుతున్నది. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. లక్షలాది మందికి జీవన భృతి లభిస్తున్నది. 50,60,70 అంతస్థుల బిల్డింగులు నిర్మిస్తున్నారు. ముంబై తర్వాత సెకండ్‌ స్కైలైన్‌ హైదరాబాద్‌లో ఉన్నది. త్వరలోనే ముంబైని కూడా దాటేస్తాం. ఇవన్నీ ఉత్తగనే మాటలు చెప్తేనో.. పిట్టకథలు చెప్తేనో కాలేదు. కఠోరమైన శ్రమ, క్రమశిక్షణతో కడుపు, నోరుకట్టుకుని రాత్రింబవళ్లు పనిచేస్తే ఇదంతా జరిగింది’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక పవిత్రమైన యజ్ఞంలా పరిపాలన చేస్తుంటే, కాంగ్రెస్‌ పార్టీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తామే తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ, ప్రజలపై ప్రేమతో రాష్ర్టాన్ని ఇవ్వలేదని, పార్టీని బలోపేతం చేసుకొనేందుకు అనివార్య పరిస్థితుల్లో మాత్రమే ఇచ్చిందని తెలిపారు.

తెలంగాణను ముంచిందే కాంగ్రెస్‌ పార్టీ అని, 41 ఏండ్లపాటు ఆ పార్టీ తెలంగాణ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచిందని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ఆ పార్టీ నాయకులు చేసిన అవమానాలు, అవహేళనలు జీవితంలో మర్చిపోలేమని అన్నారు. తెలంగాణ అనే పదంపైనే నిషేధం విధించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని మండిపడ్డారు. తెలంగాణకు, తె లంగాణ ప్రజలకు అడుగడుగునా అన్యాయం చే స్తూ.. వేల మంది పిల్లలను పొట్టనపెట్టుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కరీంనగర్‌ ఎంపీగా ఉన్న నన్ను ఓడగొట్టేందుకు నాడు చేయని ప్రయత్నం లేదు. వందలకోట్లు ఖర్చుపెట్టి, భయంకరమైన కథలు చేశారు. కానీ కరీంనగర్‌ జిల్లా ప్రజలు వీళ్ల చెంప చెళ్లుమనిపించి నన్ను రెండున్నర లక్షల మెజార్టీతో గెలిపించారు. మా తెలంగాణ మాకు కావాలని చెప్పారు. తెలంగాణ అంశాన్ని అలవోకగా తీసిపారేస్తే ఎన్నడూ ఎవరూ మాట్లాడలేదు. పౌరుషం లేదు.. ఇదే సభలో నేను ఒంటరిగా ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతుంటే మళ్లీ గోల్‌మాల్‌ చేసే ప్రయత్నం చేశారు. అంతటా విద్యార్థులు, ప్రజలు అడుగుతున్నరని, కేసీఆర్‌ సభలకు జనం వస్తున్నరని చంద్రబాబు గిర్‌గ్లానీ కమిటీ ఏర్పాటుచేశారు.

కమిటీల మీద కమిటీలు వేస్తూ మళ్లీ గిర్‌గ్లానీ కమిటీ ఎందుకు? మనమిద్దరం సెక్రటేరియట్‌ గేటుకాడ నిలబడదాం.. ఒక ఆనపకాయ చేతిలో పట్టుకుందాం, పోయేవాళ్లను అడుగుదాం..ఆనపకాయ అన్నోడు తెలంగాణోడు, సొరకాయ అన్నోడు ఆంధ్రోడు. దీనికి పెద్ద కమిటీ ఎందుకని ఇదే సభలో నేను చెప్పాను. ప్రతి సందర్భంలో తెలంగాణ అమాయక ప్రజలను వంచించి గోల్‌మాల్‌ చేయడంవల్ల సుమారు ఆరు దశాబ్ధాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది. ఎంత భయంకరమైన పరిస్థితులు.. ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, కరెంటు కోతలు.. ఇలా అనేక బాధలు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన 20-30 ఎకరాల భూములున్న రైతులు కూడా హైదరాబాద్‌లో ఆటోలు నడిపిన దుస్థితి. ఇంత దయనీయమైన పరిస్థితికి మనందరం సాక్షులమే. మధ్యలో రోశయ్య 14ఎఫ్‌ తీసుకొచ్చిండు.

ఓ వైపు ఉద్యమాలు జరుగుతుంటే 14 ఎఫ్‌ తీసుకొచ్చిండు. అప్పుడు సిద్దిపేటలో ఉద్యోగుల గర్జన పెట్టి, లక్షలమందిని సమీకరించి ఆ సభనుంచే.. కేసీఆర్‌ శవయాత్రనో, తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలని ప్రకటించా. అప్పుడే నిరాహారదీక్షకు కూ ర్చుంటే నానా రకాల యాగి చేసి, నన్ను అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పడేసి, అక్కడినుంచి ఇక్కడ నిమ్స్‌కు తెచ్చి చివరికి వీడు చస్తడా ఏంది.. మనం అప్రదిష్టపాలవుతామని, లోక్‌సభ అంతా అట్టుడికింది. తెలంగాణకు అనుకూలంగా లేకపోయినా పార్లమెంటులో ములాయంసింగ్‌ యాదవ్‌ ‘తెలంగాణ బనే నా బనే రావుసాబ్‌ నహీ మర్నా చాహియే అని మాట్లాడితే, 38 పార్టీలు గోలచేస్తే, ఆ దాడి తట్టుకోలేక చిదంబరంను పంపి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

వెంటనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నం అని చెప్పడం, మళ్లీ ఆంధ్రా లాబీ ఒత్తిడి చేయంగనే వెన క్కు తీసుకున్నారు. ప్రకటన చేసింది కాంగ్రెసే, దాన్ని వెనక్కు తీసుకున్నది కాంగ్రెసే. దీంతో మళ్ల వందలమంది విద్యార్థులు చనిపోయారు. ఇషాన్‌రెడ్డి, చేవెళ్ల యాదయ్య, శ్రీకాంతాచారి వంటి అనేకమంది ప్రాణాలు తీసుకొన్నారు. యువకులు చనిపోతున్నా వీళ్లు పట్టించుకోలేదు. కనీసం రిలీఫ్‌ ఇచ్చే ప్రయత్నం కానీ, సాంత్వన కల్పించే వచనాలు కానీ చెప్పలే.

సంస్థ ఉద్యోగులకు భద్రత, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే నిర్ణయాన్ని తీసుకున్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఆర్టీసీ కార్పొరేషన్‌ అయినప్పటికీ ఏటా రూ.1,500 కోట్లు ఇస్తూ దానిని ప్రభుత్వమే సాకుతున్నదని చెప్పారు. బయట ఉండి ఆర్టీసీని సాకడం ఎందుకని, ప్రభుత్వంలో కలిపి మరింత బలోపేతం చేయాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం శాసనసభలో సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

బ్రాహ్మణ సమాజాన్ని ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ‘బ్రాహ్మణులను మీరు ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలే. బ్రాహ్మణ సమాజాన్ని ఆదుకుంటున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ మాత్రమే. మేం బాజాప్తా.. ప్రతి వర్గం.. ప్రతి వ్యక్తి సంక్షేమం కోసం పాటుపడ్డాం. బ్రాహ్మణ సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించే ఏకైక దిలేర్‌.. దమ్మున్న రాష్ట్రం తెలంగాణ. మేం ఓట్ల కోసం భయపడం’ అని సీఎం స్పష్టం చేశారు.