cm revanth reddy speech at congress leaders Raj bhavan protest(X)

Hyd, December 18: ఆదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై నిరసనగా చలో రాజ్ భవన్ కు ఏఐసీసీ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ నిర్వహించగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువును తాకట్టు పెట్టారు అన్నారు. 75 ఏళ్ల పాటు కష్టపడి దేశ పరువును కాంగ్రెస్ పెంచింది.... వ్యాపారం చేసేందుకు ఆదానీ లంచాలు ఇచ్చారని అమెరికన్ దర్యాప్తు సంస్థ తెలిపిందన్నారు. ఆదానీని మోడీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు.

ఆదానీ అంశాన్ని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పార్లమెంటులో నిలదీశారు అని గుర్తు చేశారు. కానీ ప్రధాని మోడీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు...అందుకే దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ముట్టడికి ఏఐసీసీ పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు సీఎం రేవంత్.   తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్‌ కార్యక్రమం, పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..మంత్రులు, అదానీ వ్యవహారంపై ప్రధాని స్పందించాలని డిమాండ్

రాజ్ భవన్ కు కూతవేటు దూరంలో పోలీసులు అడ్డుకున్నారు.. అందుకే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపే పరిస్థితి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ప్రభుత్వమే ధర్నాలో కూర్చోవడమేంటని కొందరు అనుకోవచ్చు...ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందన్నారు. మా నిరసన కొందరికి నచ్చొచ్చు మరికొందరికి నచ్చకపోవచ్చు ఇంకొందరికి కడుపులో నొప్పి రావచ్చు అన్నారు.

Congress Leaders Protest at Rajbhavan

మా డిమాండ్ కోసం నిరసన తెలపడం, చట్ట సభలను స్తంభింపచేయడం చేస్తాం...ఎన్ని నిరసనలు చేసినా మోదీ దిగిరావడం లేదు అన్నారు. అదానీ విషయంలో కేసీఆర్ స్టాండ్ ఏంటో చెప్పాలి..... బీజేపీ పెద్దల కాళ్లు మొక్కి అరెస్టులను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. ప్రజలు వైపా..? అదానీ- ప్రధాని వైపా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చెప్పాలంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అదానీకి వ్యతిరేకంగా మాట్లాడితే మోదీ జైల్లో వేస్తారని కేసీఆర్ కుటుంబం భయపడుతుందని ఎద్దేవా చేశారు.