Hyderabad, June 02: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను (TelanganaFormation day) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. రాష్ట్ర సాధనకోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలను గుర్తు చేసుకున్నారు.అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎస్, డీజీపీ, అధికారులు స్వాగతం పలికారు. పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయ హే తెలంగాణ’ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీ నేతలు హాజరయ్యారు.
Watch Live: Telangana Formation Day Celebrations. ప్రత్యక్ష ప్రసారం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. #TelanganaFormationDay https://t.co/LFTSrFbDS8
— Telangana CMO (@TelanganaCMO) June 2, 2024
జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం జరుగుతుందన్నారు. కలను నెరవేర్చిన మన్మోహన్ , సోనియాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ నైజమని, స్వేచ్ఛను హరిస్తే తెలంగాణ సమాజం సహించదన్నారు. సచివాలయంలోకి సామాన్యుడికి వచ్చే అవకాశం ఇచ్చామని, తప్పులు జరిగితే సరిదిద్దుకుని ముందుకెళ్తామని స్పష్టం చేశారు. మీము సర్వజ్ఞాస్నులుగా భావించమని, అందరి సూచనలు తీసుకుంటామన్నారు. గత పదేళ్లలో వందేళ్ల విద్వంసం జరిగిందని, రాష్ట్ర సంపద గుప్పెడు మందికి చేరిందన్నారు. తెలంగాణ ప్రధాత సోనియాను ఆహ్వానించామని, అయితే ఏ హోదాలో సోనియాను ఆహ్వానిస్తున్నారనడం దురదృష్టకరమన్నారు. బిడ్డ ఇంట్లో శుభ కార్యానికి తల్లికి ఆహ్వానం కావాలా..? సోనియాది తెలంగాణ తో పేగుబంధమన్నారు. జయజహే తెలంగాణ .. రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నామని, నూతన అధికారిక లోగోను రూపొందిస్తున్నాం.. అందరి సూచనల తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లి గుర్తుకురావాలి. అందుకే జాతి ఆకాంక్షలకు ప్రతిరూపంగా తెలంగాణ తల్లి ఉంటుందని చెప్పారు.