Telangana new ration cards from January 26 says CM Revanth Reddy(CMO X)

Hyderabad, Jan 26: తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న నాలుగు పథకాలు నేడు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం నారాయణపేట జిల్లా (Narayanapet Dist.) పర్యటనలో వీటిని ప్రారంభించనున్నారు. కోస్గి మండలం, చంద్రవంచ గ్రామంలో నాలుగు పథకాలను (Four Schemes) ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ఆయన ప్రారంభిస్తారు. ఈరోజు మధ్యాహ్నం చంద్రవంచకు ఆయన రానున్నారు. సీఎం రానున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లాల అధికారుల పర్యవేక్షణలో హెలిపాడ్ , సభ నిర్వహణ ఏర్పాట్లు సిద్ధం చేశారు.

రిపబ్లిక్ డే విషెస్ మీ బంధుమిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలియజేయండి.. Whatsapp, Twitter, Facebook ద్వారా ఈ విషెస్ షేర్ చేసుకోవచ్చు..  

సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా..

సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12:10 గంటలకు హైదరాబాద్ నుండి హెలికాఫ్టర్‌ లో బయలుదేరుతారు. 12:50 గంటలకు కోస్గి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి చంద్రవంచ గ్రామానికి చేరుకొని రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించిన ప్రభుత్వం నాలుగు పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. ప్రజాపాలన, సమగ్ర సర్వే సందర్భంగా వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి.. జాబితాలను సిద్ధం చేశారు. అనర్హుల ఏరివేత, జాబితాలో పేర్లు లేని వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది కూడా.

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నేడు హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవిగో..!