Hyderabad, OCT 20: తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ (Congress), సీపీఎం-సీపీఐ మధ్య పొత్తు (CPM - CPI Alliance) పొడిచింది. సీపీఎం, సీపీఐ పార్టీలకు రెండేసి చొప్పున సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది. దీనిపై శనివారం అధికారికంగా ప్రకటన చేయనున్నారు. పొత్తులో భాగంగా సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి పోటీ చేయనున్నారు. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను కేటాయించింది. కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తారు.
కాగా, పొత్తులతో పోటీచేసే పార్టీలతో కాంగ్రెస్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో టీజేఎస్ (TJS) పార్టీ చీఫ్ కోదండరాంతో కూడా కాంగ్రెస్ అధినాయకత్వం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తమకు మొత్తం ఆరు సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోదండరాం కోరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు ఆ ఆరుగురు అభ్యర్థుల జాబితాను కూడా అందించారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ (Telangana Assembly Election) కాంగ్రెస్ తో కలిసి టీజేఎస్ పొత్తుతో పోటీ చేసింది.